Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 30 షేర్ల సెన్సెక్స్‌ సూచీ 985 పాయింట్ల లాభంతో 56,535 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 16,885 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం క్రితం సెషన్‌తో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 285 పాయింట్లు పెరిగి 55,835 ట్రేడింగ్‌ ప్రారంభమైంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 0.41శాతం పెరిగి 16,698 వద్ద టేడ్రింగ్‌ మొదలైంది. మార్కెట్‌ ప్రారంభంలో దాదాపు 1594 షేర్లు పెరగ్గా.. 513 క్షీణించాయి. 111 షేర్లు యథాతథంగానే ఉన్నాయి. గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం.. నష్టాలతో ముగియగా.. ఇవాళ లాభాల్లో ముగిశాయి.

Post a Comment

 
Top