జర్మనీలో రోడ్డు ప్రమాదం.. నాగర్‌కర్నూల్‌ విద్యార్థి మృతి

నాగర్‌కర్నూల్‌: జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్‌కర్నూల్‌ (Nagarkurnool) జిల్లాకు చెందిన విద్యార్థి (Student) మృతిచెందాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని అక్కారానికి చెందిన అమర్‌సింగ్‌ ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 13న కారు ప్రమాదంలో అమర్‌సింగ్‌ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అధికారులు బుధవారం రాత్రి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లిన కొడుకు.. కానరాని లోకాలకు వెళ్లడంతో అతని తల్లితండ్రులు శోకసంద్రంలో ఉన్నారు. కాగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బాలరాజు.. అమర్‌సింగ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని స్వస్థలం రప్పించేలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

 
Top