
తెర్లాం: విజయనగరం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెర్లాం మండలం టెక్కలివలస వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్రవాహనంపై ఐదుగురు ప్రయాణిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ రాజాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, సమీపంలో ఓ గ్రామంలో జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారులు సిద్దూ(9), హర్ష (6), రుషి(6)గా గుర్తించారు.
Post a Comment