
రాంచీ : జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై 8 మంది టీనేజర్లు సహా పది మంది సోమవారం రాత్రి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పెండ్లికి హాజరైన బాలిక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తిరిగివస్తుండగా వారిని చుట్టుముట్టిన పది మంది నిందితులు బాలికను గ్రామంలోని పొదల చాటుకు తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టారు.
ఆపై బాలికను స్కూల్ సమీపంలో విడిచిపెట్టి పరారయ్యారు. బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలిపింది. బాధితురాలి తల్లితండ్రులు బిషన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నిందితులపై ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సత్వరమే స్పందించి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. పోలీసులు 24 గంటల్లోగా కేసును ఛేదించి నిందితులందరినీ పట్టుకున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Post a Comment