• సీఎస్‌ఆర్‌ కింద అందించిన హీరో మోటార్స్‌

హైదరాబాద్‌, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్‌శాఖ, అగ్నిమాపకశాఖలకు హీరో మోటో కార్పొరేషన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద 70 ద్విచక్రవాహనాలను అందజేసింది. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర అగ్నిమాపకశాఖ కార్యాలయంలో అడిషనల్‌ డీజీ సంజయ్‌జైన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌శాఖకు 35, అగ్నిమాపకశాఖకు 35 బైకులు అందజేశారు. కార్యక్రమంలో పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎస్పీ రాజేశ్‌, ఫైర్‌సర్వీస్‌ డైరెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్లు జీవీ నారాయణరావు, పీ వర్ల, ప్రసన్నలతోపాటు హీరో మోటార్స్‌కు చెందిన కేకే సుబ్రమణ్యం, దిలీప్‌రెడ్డి, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

 
Top