
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు ఐదు వేలకు మించట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా నుంచి మరో 4,722 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33,917 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.37 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగింది. కరోనాతో 5,15,974 మంది మరణించారు.
Post a Comment