Two Men Abduct Man In Sohna Rob Over Talking To Girl Haryana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

త‌న స‌హోద్యోగితో మాట్లాడుతున్నాడని, అది సహించని ఇద్దరు వ్యక్తులు.. ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి దారుణంగా హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో సోమవారం చోటు చేసుకుంది.

సదరు యువకుడు సాహిల్‌ తన ఉద్యోగం ముగించుకొని ఇంటి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై అతన్ని అడ్డుకుని కారులోకి బలవంతంగా ఎక్కించుకుని నిర్మానుష్యంగా ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దారుణంగా హింసించారు. సాహిల్‌ వద్ద ఉన్న రూ.2వేలు, మొబైల్‌ ఫోన్‌ను లాక్కున్నారు.

తన స‌హోద్యోగి ప్రీతితో మాట్లాడితే చంపేస్తామ‌ని వారు హెచ్చ‌రించార‌ని సాహిల్‌ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తులను స్థానికంగా ఉండే రాహుల్‌, నరేష్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

 
Top