మార్చి మ‌ధ్య‌లోనే దంచికొండుతున్న ఎండ‌లు..అక్క‌డ గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త 39.4 డిగ్రీలుగా న‌మోదు!!

ప్ర‌తి ఏటా మార్చి చివ‌ర‌నుంచి భానుడి ప్ర‌తాపం మొద‌ల‌వుతుంది. కానీ ఈసారి మార్చి ప్రారంభం నుంచే ఎండ‌లు మండిపోతున్నాయి. ముంబై న‌గ‌రంలో సోమ‌వారం ఏకంగా 39.4 డిగ్రీల సెల్సియ‌స్ గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. తీవ్ర‌మైన వ‌డ‌గాలులు వీచాయి. కాగా, ఐఎండీ (భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌) మంగ‌ళ‌వారం రోజు థానే, పాల్ఘ‌ర్‌, రాయ్‌గ‌డ్‌కు హీట్‌వేవ్ హెచ్చ‌రిక‌లు జారీచేసింది.

ముంబైలో సోమ‌వారం న‌మోదైన గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే దాదాపు ఎనిమిది డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. గ‌తేడాది అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 28న 40.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇదిలా ఉండ‌గా, కొన్నిచోట్ల బుధ‌వారం కూడా వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ పేర్కొంది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

Post a Comment

 
Top