గొల్లకోటి గౌతమి (పాత చిత్రం)

కిర్లంపూడి, మసీదు సెంటర్‌(కాకినాడ): కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం వ్యాన్‌ ఢీకొని డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలోని సూర్యా డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న అడ్డతీగలకు చెందిన గొల్లకోటి గౌతమీ నాగకావ్య (21) కళాశాల నుంచి తన స్నేహితురాలితో కలిసి కృష్ణవరంలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కావ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమయ్యింది. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారని ఎస్సై బి.తిరుపతిరావు తెలిపారు. కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

 
Top