
దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో గణనీయ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా.. మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
* నిన్న 7,61,737 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,116 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
* ఇక మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. అంతకుముందు రోజు 89 మరణాలు నమోదుకాగా.. ఆ సంఖ్య మరింత తగ్గి నిన్న 47కు చేరింది. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,15,850కి చేరింది.
*గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 5,559 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ఆ రేటు 98.71 శాతానికి మెరుగైంది.
* ఇక క్రియాశీల కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 38,069 (0.09%) యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 20,31,275 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 180 కోట్లు దాటింది.
Post a Comment