జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గౌరవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టును కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళుతుండగా అదుపుతప్పిన కారు హైవే పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రగాయాలైన ఆరు నెలల చిన్నారి, మరొక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతులను హైదరాబాద్‌లోని చందానగర్ హుడా కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు, ఓ పాప ఉన్నారు. మృతులను కుటుంబరావు, ఆయన భార్య మార్తమ్మ, శాంతి, ఇందిర, కుటుంబరావు మనవరాలు ప్రిన్సీ(6నెలలు)గా గుర్తించారు. కుటుంబరావు కుమారుడు జోషి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రిన్సీ అన్నప్రాసన కోసం వీరంతా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన నాగార్జునసాగర్ ఎడమ కాలువ వంతెనపై కల్వర్టు వద్ద చిన్నపాటి మలుపు ఉంది. అతివేగంగా వస్తున్న కారు డ్రైవర్ మలుపును గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు కల్వర్టును ఢీకొట్టకపోయుంటే నేరుగా వెళ్లి కాలువలో పడేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలువలో పూర్తిస్థాయి ప్రవాహం కొనసాగుతోందని తెలిపారు.

Post a Comment