
షార్క్ పేరు వింటేనే చాలామంది భయపడిపోతారు. అవి ఉండేది సముద్రాల్లోనే అయినా.. సముద్రాన్ని చూస్తేనే మనకు షార్క్‌లు, తిమింగళాల పేర్లు గుర్తొస్తాయి. సముద్రంలోనే ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ముఖ్యంగా షార్క్ అయితే చాలా డేంజర్. షార్క్‌లలోనూ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కార్పెంటర్ షార్క్ గురించి.. దీన్నే సాఫిష్ అని కూడా అంటారు.
ఇవి అంతరించిపోతున్న షార్క్‌ల జాబితాలో ఉన్నాయి. అందుకే వీటిన సంరక్షించడం కోసం రాజ్యాంగంలోని షెడ్యూల్ వన్‌లో ఉన్న 1972 వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా రోజురోజుకూ వీటి జాతి అంతరించి పోతోంది.
తాజాగా కర్ణాటకలోని మాల్పె అనే తీరప్రాంతంలో మత్స్యకారుల వలలో ఈ భారీ షార్క్ చిక్కింది. ఇది 10 ఫీట్ల పొడవు ఉంది. సముద్రంలో నుంచి పెద్ద క్రేన్ సాయంతో దీన్ని బయటికి తీశారు.
దీని తల ముందు పొడవైన రంపం లాంటి భాగం ఉంటుంది. అచ్చం రంపంలాగానే ఉండటం వల్ల దాన్ని సాఫిష్ అని అంటారు. షార్క్ గురించి తెలియగానే.. స్థానికులు అక్కడికి చేరుకొని దాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
దీని బరువు సుమారు 250 కిలోలు ఉన్నట్టు తెలుస్తోంది. మంగళూరుకు చెందిన ఓ ట్రేడర్ దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. సీ కెప్టెన్ అనే ఫిషింగ్ బోటులో వెళ్లిన మత్స్యకారులు సముద్రం మధ్యలో చేపలు పడుతుండగా వాళ్ల వలకు ఈ షార్క్ చిక్కింది. అయితే.. అంతరించిపోయే జాబితాలో ఈ షార్క్ ఉండటం వల్ల.. దీన్ని పట్టిన మత్స్యకారులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ గణేశ్ కే వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు.
Post a Comment