
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సీజీఆర్‌ఎఫ్ ప్రత్యేక యాప్‌ను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఛైర్మన్ శ్రీరంగరావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిలు సంయుక్తంగా ప్రారంభించారు. సింగరేణిభవన్‌లోని ఈఆర్‌సీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యాప్‌కు సంబంధించిన వివరాలను ఈఆర్‌సీ ఛైర్మన్ శ్రీరంగరావు వెల్లడించారు.
ఈఆర్‌సీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా విద్యుత్తుకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్తు నాణ్యతపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. అధికారుల పనితీరుపై కూడా ఇందులో సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుల గ్రీవెన్స్ సెల్ సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా ఇందులో సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమస్యకు గ్రీవెన్స్ సెల్ పరిష్కారం చూపెట్టకపోతే అంబుడ్స్‌మెన్ అథారిటీకి సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Post a Comment