పగలు ఎండ..సాయంత్రం ఠండా

సిటీబ్యూరో, మార్చి 27 : గ్రేటర్‌లో ఆదివారం విభిన్న వాతావరణం చోటుచేసుకుంది. పగలంతా భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడిన జనం.. సాయంత్రం వరుణుడి రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మరో రెండురోజులు ఉరుములు,మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదుకానుందని పేర్కొన్నారు.

Post a Comment

 
Top