దారుణం : మ‌హిళ‌కు మ‌ద్యం తాగించి సామూహిక లైంగిక దాడి!

ల‌క్నో : యూపీలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై లైంగిక దాడుల ఘ‌ట‌నల‌కు బ్రేక్ ప‌డ‌టం లేదు. ప్ర‌తాప్‌ఘ‌ఢ్ రైల్వేస్టేష‌న్ ప‌బ్లిక్ టాయ్‌లెట్‌లో వివాహిత‌పై లైంగిక దాడి ఘ‌ట‌న మ‌రువ‌క ముందే కాన్పూర్‌లో మ‌రో ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

చ‌కెరిలాల్ బంగ్లా ప్రాంతంలోని ఓ ఇంటిలో మ‌హిళపై ముగ్గురు వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. మ‌హిళ‌కు బ‌లవంతంగా మ‌ద్యం తాగించి ఆపై ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. లైంగిక దాడిని ప్ర‌తిఘ‌టించిన మ‌హిళ‌ను వారు తీవ్రంగా హింసించారు.

మ‌హిళ అరుపులు విన్న స్ధానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌హిళ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Post a Comment

 
Top