గ్యాస్ బిల్లు చూసి షాక్ తిన్న యువ‌ జంట‌ : నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన‌ గ్యాస్ వాడ‌కం!

లండ‌న్ : బ్రిట‌న్‌లో ఓ యువ‌జంట త‌మ గ్యాస్ బిల్లు చూసి షాక్‌కు గురైంది. వారు కేవ‌లం ఒక నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన గ్యాస్‌ను వాడార‌ని బిల్లులో పేర్కొన‌డంతో శ్యాం మాట్రం (22), మాడీ రాబ‌ర్ట్‌స‌న్ (22) కంగుతిన్నారు. షెల్ ఎన‌ర్జీ యాప్‌లో ఈ భారీ బిల్లు చూసి వారి గుండె గుభేల్‌మంది. ఈ త‌ర‌హా నోటిఫికేష‌న్ వ‌చ్చి ఉంటే త‌మ‌కు గుండె పోటు వ‌చ్చేద‌ని వారు చెప్పుకొచ్చారు.

ఇంగ్లండ్‌లోని హార్పెన్‌డెన్‌లో నివ‌సించే ఈ జంట ఏటా గ్యాస్‌, విద్యుత్ వాడ‌కంపై 1300 యూరోలు వెచ్చిస్తారు. గ్యాస్ ధ‌ర‌లు పెరిగాయ‌ని త‌న‌కు తెలుస‌ని అయితే ఈ రేంజ్‌లో మండిపోతున్నాయ‌ని త‌న‌కు తెలియ‌ద‌ని శ్యాం చెప్పుకొచ్చారు. ఈ బిల్లు పొరపాటున వ‌చ్చి ఉంటుంద‌ని తాను అనుకున్నాన‌ని మ్యాడీ పేర్కొంది. సాంకేతిక లోపం వ‌ల్లే ఈ పొర‌పాటు జ‌రిగింద‌ని షెల్ ఎన‌ర్జీ యువ జంట‌కు స‌ర్ధిచెప్పింది.

వారికి వ‌చ్చిన బిల్లు బ్రిట‌న్‌లో గ్యాస్‌, విద్యుత్‌పై గృహ వినియోగంపై వెచ్చించే మొత్తంలో 15 శాతమ‌ని షెల్ ఎన‌ర్జీ ప్ర‌తినిధి చెప్పారు. త‌మ యాప్‌లో ఎర్ర‌ర్ వ‌ల‌నే కొద్దిమంది క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ బిల్లులు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఈ మొత్తం శ్యాం, మ్యాడీలు చెల్లించాల్సిన అవ‌సరం లేద‌ని అన్నారు. ఇదే యాప్‌లో క‌స్ట‌మ‌ర్ల డైరెక్ట్ డెబిట్ చెల్లింపుల‌పై ఇది ప్ర‌భావం చూప‌ద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

Post a Comment

 
Top