కూతురిని గొడ్డ‌లితో న‌రికి చంపాడు.. త‌ల‌తో ఊరంతా తిరిగాడు..

భువ‌నేశ్వ‌ర్ : కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కూతుర్ని ఓ తండ్రి అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. ఆమెను గొడ్డ‌లితో న‌రికి చంపి, త‌ల‌తో ఊరంతా తిరిగాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని జైపూర్ జిల్లాలో శుక్ర‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

జ‌మ‌న్ కీరా బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన 30 ఏండ్ల వ్య‌క్తికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నాయి. అయితే ఓ అమ్మాయి శుక్ర‌వారం ఉద‌యం కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు త‌మ వ్య‌వ‌సాయ పొలం వ‌ద్ద‌కు వెళ్లింది. కూతురు వెనుకాలే వెళ్లిన తండ్రి.. ఆమెను గొడ్డ‌లితో విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికి చంపాడు. అనంత‌రం మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసి గ్రామంలోకి తీసుకొచ్చాడు.

ఆ త‌ర్వాత త‌ల‌తో ఊరంగా తిరిగి, అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. కూతుర్ని చంపాడ‌న్న వార్త తెలుసుకున్న త‌ల్లి.. అత‌న్ని మంద‌లించేందుకు య‌త్నించింది. ఆమెను గొడ్డ‌లితో బెదిరించాడు. స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Post a Comment

 
Top