2019 లో మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ ప్రాంతానికి చెందిన బొచ్చు వినయ్ అనే నిందితుడు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని  కల్వల రవి అనే వ్యక్తి పై బీర్ సీసా తో  దాడి చేసి చంపడానికి పాల్పడ్డారని అలాగే గజ్జెల గోపాల్ ను కర్రతో గాయపర్చారని రవి తమ్ముడు అయినటువంటి కల్వల మహేందర్ S/o అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై అయినటువంటి మచ్చ శివ కుమార్ గారికి గారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చెప్పటి అట్టి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.అనంతరం,దర్యాప్తు లో భాగంగా...28-09-2020 నాడు మందమర్రి ఎస్సై భూమేశ్ గారు ఛార్జి షీట్ ఫైల్ చెయ్యడం జరిగింది.అట్టి కేసును న్యాయస్థానం విచారణ చెప్పటి ఈ రోజు తీర్పును ఇవ్వడం జరిగింది.


                      ---వివరాల్లోకి వెళ్తే---


👉 కేసు దర్యాప్తు లో భాగంగా...కేసుకు సంబంధించి కోర్టులో 2021 డిసెంబర్ నుండి ట్రయల్స్ జరుగుతున్న నేపథ్యంలో...కేసుకు సంబంధించి సరైన సాక్షాధారాలతో అడిషనల్ పి.పి  శ్రీ కె.మదన్ మోహన్ రావు గారు 17 మంది సాక్షులను కోర్టులో హాజరుపర్చగా మంచిర్యాల జిల్లా సీనియర్ సివిల్  జడ్జి(సబ్-కోర్టు) గౌరవ శ్రీ. ఉదయ్ కుమార్ గారు సాక్షాధారలు పరిశీలించి...తీర్పు వెలువడించారు.


🔹 అట్టి హత్య ప్రయత్నం కేసు నిందితులైన...👇👇👇👇👇


A1. బొచ్చు వినయ్ S/o మల్లయ్య,వయస్సు:25yrs,కులం:మాదిగ,వృత్తి:డ్రైవర్,R/o:- CSP రోడ్,అంగడి బజార్, మందమర్రి.


A2. జూపక శ్రావణ్ @బన్నీ S/o జూపక మొండి,వయస్సు:19yrs,కులం:మాదిగ,వృత్తి:మెకానిక్,R/o:- పోచమ్మ టెంపుల్,అంగడి బజార్,మందమర్రి.



✍️ అను ఇద్దరి(2) నింధితులకు A1 కు నాలుగు(4) సంవత్సరాల జైలు శిక్ష మరియు 2000/- రూపాయల జరిమాణ,A2 కు ఒక(1)సంవత్సరం జైలు శిక్ష మరియు 1000/- రూపాయల జరిమాణ  విధిస్తూ మంచిర్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి(సబ్-కోర్టు) గౌరవ శ్రీ. ఉదయ్ కుమార్ గారు తీర్పును ఇవ్వడం జరిగింది.


👉 అట్టి నిందితులకు శిక్ష పడటానికి కృషి చేసిన సి.ఐ ప్రమోద్ రావు గారిని,ఎస్సై భూమేష్ గారిని CDO కోర్టు కానిస్టేబుల్ టి.మధుసూదన్ (PC 3003) రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి IPS(ఐ.జి) గారు మరియు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గార్లు అభినందించారు.


                            ఇట్లు


                        భూమేష్

                  ఎస్సై ఆఫ్ పోలీస్


                       మందమర్రి

Post a Comment

 
Top