తిరుపతిలో మరో విద్యార్థి ఆత్మహత్య ..

అమరావతి : తిరుపతిలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు వేర్వేరు హాస్టళ్లలో ఆత్మహత్యకు పాల్పడడం తిరుపతిలో సంచలనం కలిగిస్తోంది. తిరుపతిలోని వెస్ట్‌ చర్చి సమీపంలోని బీసీ బాలుర వసతిగృహం ఐదో అంతస్తు నుంచి విద్యార్థి నాగేంద్రకుమార్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న నాగేంద్ర చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగానిపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే నాగేంద్ర కుమార్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సహచర విద్యార్థులు పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

కాగా తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న మరో విద్యార్థిని విష్ణుప్రియ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యకు కూడా ప్రేమ వ్యవహారం కారణమని సంఘటన స్థలం వద్ద లభించిన ప్రేమలేఖలు, ప్రియుడు పంపించిన బహుమతుల స్వాధీనం బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు.

Post a Comment

 
Top