OnePlus 10 Pro | వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో ధ‌ర లీక్.. ఎంతో తెలుసా?

OnePlus 10 Pro | మార్చి 31న వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో భార‌త్‌లో లాంచ్ కానున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఫోన్ ధ‌ర ఎంతో మాత్రం కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఫీచ‌ర్లు కూడా పూర్తిగా తెలియ‌లేదు. అయితే.. ఈ ఫోన్ ధ‌ర‌, ఫీచ‌ర్లు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ధ‌ర లీక్ అవ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ ఫోన్ గురించే చ‌ర్చ న‌డుస్తోంది.

ఇటీవ‌లే చైనాలో రిలీజ్ అయిన వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో ఫోన్‌లోఉండే ఫీచ‌ర్ల‌తోనే భార‌త్‌లో కూడా లాంచ్ అవ‌నున్న‌ట్టు తెలుస్తోంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జ‌న‌ర‌ల్ 1 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌తో రానున్న ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధ‌ర రూ.66,999 గా ఉంటుంద‌ని తెలుస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్ ధ‌ర రూ.71,999గా ఉంటుందని స‌మాచారం. ఏప్రిల్ 5 నుంచి ఈ ఫోన్ సేల్స్ భార‌త్‌లో ప్రారంభం కానున్నాయి.

ఈ ఫోన్ కంటే ముందు లాంచ్ అయిన వ‌న్‌ప్ల‌స్ 9 ప్రో ఫోన్ బేసిక్ వేరియంట్ ధ‌ర రూ.64,999గా ఉండ‌గా.. టాప్ ఎండ్ మోడ‌ల్ ధ‌ర రూ.69,999గా ఉంది.

ఈ ఫోన్ 6.7 ఇంచ్ క‌ర్వ్‌డ్ ఎల్‌టీపీవో 2.0 ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, క్యూహెచ్‌డీ ప్ల‌స్ రెజ‌ల్యూష‌న్, గొరిల్లా గ్లాస్ విక్ట‌స్, క్వాల్‌క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జ‌న‌ర‌ల్ 1 ఎస్‌వోసీ, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 80 వాట్స్ సూప‌ర్ ఫ్లాష్ చార్జ్, 48 ఎంపీ సోనీ ప్రైమ‌రీ సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచ‌ర్లతో రానున్న‌ట్టు తెలుస్తోంది.

Post a Comment

 
Top