సకల హంగుల.. రైతు బజార్‌

దళారులకు చోటివ్వద్దు

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 27: కేపీహెచ్‌బీ కాలనీలో రూ.15 కోట్లతో ఆధునీకరించిన కూకట్‌పల్లి మోడల్‌ రైతుబజార్‌ను ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు తదితరులు ప్రారంభించారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ రైతుబజార్‌లో అన్నదాతలు సేద తీరేందుకు విశ్రాంతి గదులు, స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్స్‌, క్యాంటీన్‌, సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ స్క్రీన్‌లు, మిగిలిపోయిన కూరగాయలతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ ప్లాంటు వంటివి ఏర్పాటు చేయడం విశేషం.

దళారులకు చోటివ్వద్దు
రైతుబజార్లలో రైతులు మాత్రమే విక్రయించాలని, వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. రూ.15 కోట్లతో ఆధునీకరించిన కూకట్‌పల్లి మోడల్‌ రైతుబజార్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు పాల్గొన్నారు.

Post a Comment

 
Top