మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు.. ఏడు రోజుల్లో ఇది ఆరో సారి..

న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమ‌వారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీట‌ర్‌కు రూ. 4 వ‌ర‌కు చ‌మురు సంస్థ‌లు పెంచాయి.

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.71, డీజిల్ లీట‌ర్ రూ. 99.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 114.19, డీజిల్ లీట‌ర్ రూ. 98.50, కోల్‌క‌తాలో పెట్రోల్ రూ. 108.85, డీజిల్ రూ. 93.92, చెన్నైలో పెట్రోల్ రూ. 105.18, డీజిల్ రూ. 95.33గా ఉంది.

Post a Comment

 
Top