మ‌సాజ్ మాటున రాస‌లీల‌లు : స్పా పేరుతో సాగుతున్న సెక్స్ రాకెట్స్ భ‌గ్నం!

న్యూఢిల్లీ : స్పా పేరుతో సెక్స్ రాకెట్‌లు నిర్వ‌హిస్తున్న రెండు ముఠాల గుట్టును వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఢిల్లీ పోలీసులు ర‌ట్టు చేశారు. రిష‌బ్ విహార్‌లోని పంక‌జ్ ప్లాజాలో అవేదం స్పాలో సెక్స్ రాకెట్ సాగుతోంద‌నే స‌మాచారంతో ఆనంద్ విహార్ పోలీసులు, స్పెష‌ల్ స్టాఫ్ సంయుక్తంగా ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. డెకాయ్‌ క‌స్ట‌మ‌ర్ స్పాకు వెళ్ల‌డంతో రూ 500కు మ‌సాజ్ చేస్తామ‌ని స్పా నిర్వాహ‌కులు చెప్పారు.

ఆపై లోప‌లికి వెళ్ల‌గా అక్క‌డున్న యువ‌తి రూ 1000 ఇస్తే కోరిక తీరుస్తాన‌ని తెలిపింది. దీంతో డెకాయ్ క‌స్ట‌మ‌ర్ పోలీసుల‌కు సంకేతాలు పంప‌డంతో పోలీసుల బృందం స్పాపై దాడిచేసింది. ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు స్పా నిర్వాహ‌కుడు నితిన్ గుప్తా కోసం గాలిస్తున్నారు. ఇక మ‌రో ఘ‌ట‌న‌లో దిల్షాద్ గార్డెన్ కాల‌నీలోని ఓ స్పాపై జ‌రిపిన దాడుల్లో ఆరుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ స్పాకు డెకాయ్ క‌స్ట‌మ‌ర్‌గా వెళ్లిన వ్య‌క్తితో స్పా హెడ్ సుధ అత‌డికి ఇద్ద‌రు అమ్మాయిల‌ను స‌మ‌కూరుస్తాన‌ని చెప్పింది. క‌స్ట‌మ‌ర్‌కు ఇద్ద‌రు యువ‌తుల‌ను చూపిన ఆమె రూ 15,00 ఇవ్వాల‌ని కోరింది. ఈ స్పా వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Post a Comment

 
Top