SBI on Home Loans | చౌక ధ‌ర‌కే సొంతింటి క‌ల‌.. ఐదు ఫైనాన్స్ సంస్థ‌ల‌తో ఎస్బీఐ జ‌ట్టు!

SBI on Home Loans | సొంతింటి క‌ల సాకారం చేసుకునే వారి కోసం ఎస్బీఐ మ‌రో శుభ‌వార్త అందించింది. చౌక ధ‌ర‌కే ఇండ్ల రుణాలిచ్చేందుకు ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల‌తో స‌హ‌-రుణ ఒప్పందాలు చేసుకున్న‌ట్లు గురువారం తెలిపింది. ఎస్బీఐ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థ‌ల్లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌, ఐఐఎఫ్ఎల్ హోం ఫైనాన్స్‌, శ్రీ‌రాం హౌసింగ్ ఫైనాన్స్‌, ఎడెల్‌వైస్ హౌసింగ్ ఫైనాన్స్‌, కాప్రి గ్లోబ‌ల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఆర్బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు లోబ‌డి అన్ స‌ర్వ్‌డ్ & అన్‌డిజ‌ర్వ్‌డ్ ( unserved and underserved ) రంగాల వారికీ ఈ సంస్థ‌ల‌తో క‌లిసి ఎస్బీఐ రుణ ప‌ర‌ప‌తి క‌ల్పిస్తుంది.

భార‌త్‌లో ప్ర‌స్తుతం చౌక‌ధ‌ర‌కు ఇండ్ల కొర‌త కొన‌సాగ‌డం ఆందోళ‌న‌క‌రం. ప్ర‌త్యేకించి అసంఘ‌టిత రంగ‌, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చౌక‌ధ‌ర‌కు ఇండ్లు దొర‌క‌డం క‌ష్టంగా ప‌రిణ‌మించింద‌ని ఎస్బీఐ తెలిపింది.

ఈ రంగాల వారి సొంతింటి క‌ల నిజం చేయ‌డానికి మ‌రిన్ని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ‌ల‌తో క‌లిసి స‌హ‌-రుణ అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను చురుగ్గా ప‌రిశీలిస్తున్న‌ట‌లు తెలిపింది. మ‌రింత మందికి హోంలోన్ అందుబాటులోకి తేవ‌డానికి త‌మ పంపిణీ నెట్‌వ‌ర్క్ విస్త‌రించ‌డ‌మే ల‌క్ష్యం అని ఎస్బీఐ చైర్మ‌న్ దినేశ్ ఖ‌రా తెలిపారు. 2024 నాటికి అంద‌రికీ ఇల్లు అన్న ప్ర‌భుత్వ విజ‌న్‌కు చేయూత ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా తాము ఫైనాన్స్ సంస్థ‌ల‌తో జ‌త క‌డుతున్నామ‌న్నారు.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌తో క‌లిసి బ్యాంకులు స‌హ‌-రుణ ప‌థ‌కం అందించ‌డానికి ఆర్బీఐ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. చౌక ధ‌ర‌కు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఇండ్లు పొంద‌డానికి రుణ ప‌ర‌ప‌తి అవ‌కాశాలు మెరుగు ప‌ర్చ‌డ‌మే ప్రాధాన్యం అని ఆర్బీఐ తెలిపింది.

Post a Comment

 
Top