లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి అధికారం చేపట్టనుండటంతో ఓ వ్యక్తి తీవ్రంగా భయపడుతున్నాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న తనను చంపేస్తారేమో అనే భయంతో స్వచ్ఛందంగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. తనను కాల్చి చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన గౌతమ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేరస్థులను వదిలిపెట్టబోమని గతంలో యోగి ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తాను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నానని.. తనను చంపొద్దంటూ ప్లకార్డు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

Post a Comment

 
Top