
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడి వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కు పద్మాజీవాడి ఎక్స్‌రోడ్డ్ వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిగా తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందినవారు లింగంపేట మండలం కొండాపూర్‌కు చెందిన చోటేమియా(50), నిజాంసాగర్ మండలం అచ్చంపేటకు చెందిన కౌరున్(45), హైదరాబాద్‌రు చెందిన సయ్యద్ సారిక్(70)గా గుర్తించారు. గాంధారి మండలం సీతాయిపల్లిలో అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Post a Comment