60 కేసుల్లో నిందితుడు.. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌తం

చెన్నై : క్రూర‌మైన నేరాల‌కు పాల్ప‌డి 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న‌ ఓ రౌడీషీట‌ర్‌ను త‌మిళ‌నాడు పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. రౌడీషీట‌ర్ నీర‌వి మురుగ‌న్ అనే వ్య‌క్తి త‌మిళ‌నాడులోని ప‌లు జిల్లాల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాడు. తిరునేల్‌వెలి, ట్యుటికోరిన్, క‌న్యాకుమారి జిల్లాల్లో మురుగ‌న్‌పై కిడ్నాప్‌ల‌తో పాటు హ‌త్య కేసు న‌మోదైంది. అలా అత‌నిపై 60 కేసులు న‌మోదు అయ్యాయి. దిండిగ‌ల్‌లో కూడా మురుగన్‌పై దొంగ‌త‌నం కేసు న‌మోదైంది. 40 తులాల బంగారాన్ని ఓ డాక్ట‌ర్ ఇంట్లో దోచుకెళ్లాడు. అంతేకాకుండా 2004లో త‌మిళ‌నాడు మాజీ మంత్రి అల్లాది అరుణ‌ను హ‌త్య చేశాడు. క‌ర్ణాట‌క‌లోనూ మురుగన్‌పై కేసులు ఉన్నాయి. త‌

మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో న‌మోదైన కేసుల నుంచి మురుగ‌న్ త‌ప్పించుకుంటున్నాడు. అయితే మురుగ‌న్ తిరునేల్‌వెలి జిల్లాలోని క‌ల‌క్క‌డ్ మున్సిపాలిటీ ఏరియాలో త‌ల‌దాచుకుంటున్న‌ట్టు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలో రౌడీషీట‌ర్‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. పోలీసుల‌కు చిక్కిన మురుగ‌న్ వారి నుంచి త‌ప్పించుకునేందుకు కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో న‌లుగురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. పోలీసులు కూడా రౌడీషీట‌ర్‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు.

Post a Comment

 
Top