తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కాంట్రాక్ట్ కార్మికులు గురువారం మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు 25 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు నిరవదిక సమ్మెను కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం కార్మికులు కార్యాలయల ప్రధాన ద్వారంకు అడ్డుగా కుర్చుని అధికారులను లోనికి వెళ్ళకుండా  అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి లోనికి వెళ్ళాలని కార్మికులు భిస్మించుకొని తెలపడం తో అధికారులు చేసేది లేక కార్యాలయ ఆవరణలోని చెట్ల కిందనే  ఉన్నారు. ఈ సందర్బంగా మునిస్పాల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్య దర్శి కాసర్ల రాజలింగు,మునిస్పాల్ అద్యక్షుడు వెన్న రాజం లు మాట్లాడుతూ తము చేస్తున్న నిరవదిక సమ్మెను అటు ప్రబుత్వం ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదనను వ్యక్తం చేసారు. 

Post a Comment

 
Top