గుండె శస్త్ర చికిత్సలో.. అత్యాధునిక త్రీడి మ్యాపింగ్‌ సిస్టం

  • అందుబాటులోకి తీసుకుచ్చిన సన్‌షైన్‌ ఆసుపత్రి

బేగంపేట్‌ మార్చి 21: గుండె శస్త్ర చికిత్స విధానంలో దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్రీడీ మ్యాపింగ్‌ ద్వారా స్టెంట్‌ను కచ్చితంగా అమర్చవచ్చునని సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ వైద్య నిపుణులు తెలిపారు. మానవ శరీరంలో అతి ముఖ్యమైన గుండె శస్త్ర చికిత్సలో అత్యాధునిక సరికొత్త కార్డియాక్‌ సిస్టమ్‌ను సన్‌షైన్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చినట్టు గుండె శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి, సన్‌షైన్‌ ఎండీ గురువారెడ్డిలు సోమవారం వెల్లడించారు. ఈ టెక్నాలజీ భారత దేశంలోనే గుండె సంబంధిత చికిత్సల్లో అత్యంత అధునాతన త్రీడీ మ్యాపింగ్‌ పద్ధతి అని అన్నారు. దీని ద్వారా రక్త నాళాల్లో స్టంట్స్‌ సరిగ్గా అమరాయా? లేదా? అనేది కచ్చితంగా నిర్ధారించే అవకాశం ఉంటుందని తెలిపారు. గుండెకు సంబంధించిన సమస్యలను కచ్చితంగా తెలుసుకొని సులువుగా చికిత్స చేసేందుకు ఈ అత్యాధునిక పద్ధతి ఎంతగానో ఉపయోగ పడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు బృందం శైలేందర్‌ రెడ్డి, విజయ్‌ కుమార్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Post a Comment

 
Top