మాజీ ప్రియురాలి పెళ్లిలో ప్ర‌త్య‌క్ష‌మైన ప్రియుడు.. ఏం చేశాడో తెలిస్తే అవాక్క‌వుతారు : వైర‌ల్ వీడియో

ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా సినిమాల్లో చూస్తుంటాం. పెళ్లి అవుతుండ‌గా ఓ వ్య‌క్తి ఆపండి.. అంటూ అర‌వ‌డం.. ఆ త‌ర్వాత ఆ పెళ్లి ఆగిపోవ‌డం.. ఎన్ని సినిమాల్లో చూడ‌లేదు. తాజాగా ఓ వ్య‌క్తి త‌న మాజీ ప్రియురాలి పెళ్లికి వెళ్లి ర‌చ్చ చేశాడు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

క‌ళ్యాణ మండ‌పంలో పెళ్లి జ‌రుగుతోంది. దండ‌లు మార్చుకునే తంతును పూజారి నిర్వ‌హిస్తున్నాడు. ఇంత‌లో ఓ వ్య‌క్తి ప‌రిగెత్తుకుంటూ క‌ళ్యాణ్ మండ‌పం ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. వైట్ ష‌ర్ట్ వేసుకొని వ‌చ్చిన ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. పెళ్లి కూతురు మాజీ ల‌వ‌ర్ అని అక్క‌డున్న బంధువుల‌కు త‌ర్వాత తెలిసింది. అక్క‌డికి వ‌చ్చిన ఆ వ్య‌క్తి అచ్చం సినిమాల్లో జ‌రిగిన‌ట్టు పెళ్లి కొడుకు ముందే పెళ్లి కూతురును తాను ఎంత ప్రేమిస్తున్నాడో అంద‌రికీ చెప్పాడు.

ఈ స‌మాజం ఏమ‌నుకుంటుందో అని నువ్వు భ‌య‌ప‌డ‌కు. ఎందుకంటే నేను నిన్న నిజంగా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాజ‌ల్ అంటూ బాధ‌ప‌డ్డాడు. ఆ త‌ర్వాత నువ్వు కూడా న‌న్ను ప్రేమిస్తున్నావ‌ని ఇక్క‌డ ఉన్న అంద‌రికీ చెప్పు అంటూ పెళ్లికూతురును కోరాడు.

అత‌డు.. పెళ్లి మండ‌పం మీదికి వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటే.. పెళ్లికొడుకుతో పాటు పెళ్లికి వ‌చ్చిన బంధువులు సినిమా చూస్తున్న‌ట్టుగా ఉండిపోయారు. క‌ట్ చేస్తే అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రో కూడా నాకు తెలియ‌దు. ప్రేమ త‌ర్వాత అస‌లు ముందు నువ్వెవ‌రో కూడా నాకు తెలియ‌దు అంటూ పెళ్లికూతురు అన‌డం కొస‌మెరుపు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌గా.. ఆ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి తెగ న‌వ్వుకుంటున్నారు.

Post a Comment

 
Top