సాగర్‌ కాల్వలో దూకిన ప్రేమజంట

  • యువకుడు బాలకృష్ణ గల్లంతు
  • బాలికను కాపాడిన స్థానికులు

హాలియా, మార్చి 21: ఓ ప్రేమజంట సాగర్‌ ఎడమకాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువకుడు గల్లంతవ్వగా, యువతిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హాలియా పట్టణం లో సోమవారం జరిగింది. ఏపీలోని గుం టూరు జిల్లా మాచర్ల మండలం రేగులవరం తండాకు చెందిన వడ్త్యా బాలకృష్ణ (21), నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం నర్లంగతండాకు చెందిన బాలిక(17) వరుసకు బావామరుదళ్లు. కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. తమ ప్రేమను కుటుంబ పెద్దలు తిరస్కరిస్తారని భావించిన వీరు సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకొనేందుకు హాలియా వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో దూకారు. వరద ప్రవాహానికి బాలకృష్ణ కొట్టుకుపోయాడు. బాలికను చూసిన హోంగార్డు పోలీసులకు సమాచారమిచ్చా డు. ఎస్సై క్రాంతికుమార్‌, పోలీస్‌ సిబ్బంది స్థానికుల సాయంతో బాలికను రక్షించారు.

Post a Comment

 
Top