బాలిక‌ను బెదిరించి సామూహిక లైంగిక దాడి..ఆపై నేరాన్ని వీడియో తీసి..!

గువ‌హ‌టి : 16 ఏండ్ల బాలిక‌ను బెదిరించి సామూహిక‌ లైంగిక దాడికి పాల్ప‌డిన‌ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు బికీ అలీ పోలీస్ క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించాడు. న‌లుగురు నిందితుల‌ను ప‌ట్ట‌కునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

మిగిలిన న‌లుగురు నిందితుల‌ను ఫైజ‌ల్ అలీ, పునా అలి, పింక్ అలీ, ర‌జా అలీగా గుర్తించారు. పోలీస్ అధికారి నుంచి స‌ర్వీస్ రివాల్వ‌ర్‌ను గుంజుకుని ప్ర‌ధాన నిందితుడు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా అత‌డిని పోలీసులు కాల్చిచంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 16న 16 ఏండ్ల బాలిక‌ను ఐదుగురు నిందితులు బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ‌టంతో పాటు నేరాన్ని వీడియో చిత్రీక‌రించారు.

అభ్యంత‌ర‌క‌ర వీడియోను బ‌హిర్గ‌తం చేస్తామ‌ని వారు ఫిబ్ర‌వ‌రి 19న మ‌రోసారి బాలిక‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశారు. నిందితుల‌పై పోక్సో, ఐటీ యాక్ట్ స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

Post a Comment

 
Top