మేడ్చల్‌లో లారీ డ్రైవ‌ర్ నిర్వాకం.. ఇద్ద‌రు కార్మికులు మృతి

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : పేట్‌బ‌షీరాబాద్ ప‌రిధి గోదావ‌రి హోమ్స్‌లో దారుణం జ‌రిగింది. నిద్రిస్తున్న కార్మికుల‌పైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. తెల్ల‌వారుజామున భ‌వ‌నం వ‌ద్ద‌కు స్టీల్ లోడ్‌తో లారీ వ‌చ్చింది. నిర్మాణంలో ఉన్న‌భ‌వ‌నం ముందు ఇద్ద‌రు కార్మికులు నిద్రిస్తున్న విష‌యాన్ని లారీ డ్రైవ‌ర్ గ‌మ‌నించ‌లేదు. లారీని వెన‌క్కి తీసుకురావ‌డంతో.. టైర్ల కింద న‌లిగి కార్మికులిద్ద‌రూ చ‌నిపోయారు.

మృతుల‌ను చంద‌న్ రామ్(23), కుమార్ స‌హ‌రి(23)గా పోలీసులు గుర్తించారు. వీరు బీహార్‌కు చెందిన వ‌ల‌స కార్మికులు అని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ స‌భ్యులు విషాదంలో మునిగిపోయారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Post a Comment

 
Top