ప్రబుత్వ సంస్తలో ఒప్పంద ఉద్యోగాలను ఇప్పిస్తామని నిరుద్యోగులనుండి కోట్ల రూపాయలు వాసులు చేసి నకిలీ నియామక పత్రాలు సృష్టించిన దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం జిల్లాలో సంచలనం సృష్టించింది ఓక బాదితుడీ ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు లోతుగా విచారణ ప్రారంభిచేసరికి నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తున్నయీ . మందమర్రి కి చెందినా ఒక వ్యక్తికీ జన్నారం మండలం లోని ఒక పంచాయితి కార్యాలయం లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇప్పిస్తాం అంటూ గోదావరిఖనికి చెందినా ఇద్దరు దళారులు ఎనిమిది లక్షలు వసులు చేశారు . వారికీ పెద్దపల్లి డి.ఎల్.పి ఓ కార్యాలయం లో పనిచేసే వ్యక్తీ తో పరిచయం ఉండటం తో ముగ్గురు కలిసి నకిలీ నియామక పత్రాలు సృష్టించి మందమర్రి కి చెందినా వ్యక్తీ కి ఉద్యోగం ఇప్పించారు రెండు నెలలు అవుతున్న వేతనాలు చెల్లించక పోవడం తో ఆ వ్యక్తీ కి అనుమానం వచ్చి తను మోసపోయానని బావించి మందమర్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎస్.ఐసతీష్ గారు మరియు సి.ఐగారు విచారణ జరపగా పెద్దపల్లి బి ఎల్ పి ఓ వెంకయ్య మరియు గోదావరిఖని కి చెందినా లక్ష్మన్,రమేష్,రవి కుమార్ ల పాత్ర ఉందని తెలియడంతో విచారణ జరిపారు ఈ క్రమంలో దీపక్ నగర్ కు చెందినా వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు జిల్లాలకు చెందిన నిరుద్యోగులనుండి 40 లక్షలు వాసులు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కావున బెల్లపల్లీ dsp రమణ రెడ్డి గారు మరియు మందమర్రి ఎస్ ఐ సతీష్ గారి అద్వర్యంలో విచారణ కొనసాగుతుంది.
రిపోర్టర్ : రాజ్ కుమార్ బుర్ల

Post a Comment