TBGKS మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గారి అధ్యక్షతన  ఈ నెల 8 వ తేదీన CCC శ్రీరాంపూర్ లో నిర్వహించే సమావేశానికి 'సింగరేనియన్ సన్స్ అసోసియేషన్' కి గురువారం రాత్రి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు SSA వ్యవస్థాపకుడు మెండే కృష్ణ కుమార్ TDAILY.IN అడ్మిన్ ఉప్పల సంపత్ తో మాట్లాడుతూ.. వారసత్వ ఉద్యోగాల కోసం SSA చేస్తున్న పోరాటాన్ని గుర్తించి TBGKS ఈ సమావేశానికి ప్రతి సింగరేణి కార్మికుని కుమారున్ని ఆహ్వానించిందని, మనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి SSA సభ్యుడు ఈ సమావేశానికి తప్పకుండ హాజరు కావాలని పిలుపునిచ్చారు. SSA కేవలం సర్వీస్ 24 నెలల కన్నా ఎక్కువ ఉన్న వారి కోసమే పోరాడడం లేదని.. సర్వీస్ అయిపోయిన కార్మికుల కోసం కూడా పోరాడుతుందని తెలిపారు. అలాగే వారసత్వ ఉద్యోగాల కోసం రాజకీయ పార్టీలకతీతంగా ఎవరు పోరాటం చేసిన తమ మద్దతు ఇస్తామని.. SSA ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదని.. కేవలం సింగరేణి కార్మికుల వారసుల సొత్తని ... వారసత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.


సమావేశపు వివరాలు : 
తేది : 08 నవంబర్ 2015 ( ఉదయం 10 గంటలకు )

వేదిక : న్యూ కమ్యూనిటీ హాల్ , శ్రీ సరస్వతి శిశు మందిర్ పక్కన, 
 C.C.C నస్పూర్ కాలనీ, శ్రీరాంపూర్

 
           అలాగే సమావేశానికి వచ్చే ప్రతి SSA సభ్యుడు కూడా ఇది మన సమావేశం అనుకుని బాధ్యతతో మెలగాలని, మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ఆకాంక్షను చాటాలని పిలుపు నిచ్చారు. SSA అందరి మద్దతుని కూడగట్టుకుని ముందుకు వెళ్తుందని.. భవిష్యత్తు లో ఎవరు ఎలాంటి సమావేశం ఏర్పాటు చేసిన కూడా వారసత్వ హక్కు కోసం SSA మద్దతు ఇస్తుందని తెలిపారు. 

Post a Comment

 
Top