18 సంవత్సరాల వయస్సు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మంచిర్యాల అర్దిఓ అయేషా మస్రాట్ ఖానం తెలిపారు.ఆదివారం రోజున మంచిర్యాల పట్టణంలోని పలు వర్డులలో బూత్ లెవెల్లో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్దిఓ పరిశీలించారు. ఈ సందర్బంగా అర్దిఓ మాట్లాడుతూ,18 సంవత్సరములు నిండిన వారు, గతంలో ఏదైనా కారణములతో తిరస్కరించబడిన వారు మరల తమ పేరును నమోదు చేసుకొనుటకు 04-11-2015 లోగ ఫారం-6ను నింపి అర్దిఓ కార్యాలయంలో గాని, తహసిల్దార్ కార్యాలయంలో,మునిస్పాల్ కార్యాలయంలో గాని సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్దిఓ వెంట తహసిల్దార్ సురేష్ బాబు,బూత్ లెవెల్ అధికారులు, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

 
Top