మందమర్రి మండలం లో మేడారం, పులిమడుగు స్తేజీల్లో బస్సులు అపకపోవడం తో మంచిర్యాలకు వెళ్ళే విద్యార్దులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండలం అధ్యక్షుడు రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్ధులు, మంచిర్యాలకు వివిధ పనులు నిమిత్తం నిత్యం వెళ్ళే ప్రజలు బస్సు స్టాప్లలో అపకపోవటం తో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంతకు ముందు మంచిర్యాల డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు. అధికారులు విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి మేడారం,పులిమడుగు స్టేజీలా వద్ద బస్సులు ఆపాలని డిమాండ్ చేశారు.
Post a Comment