స్తానిక మార్కెట్ ప్రాంతం లో రామకృష్ణ మెడికల్ షాప్లో నిర్వహిస్తున్న ల్యాబ్ లోని పరికరాలను దొంగలు శుక్రవారం రాత్రి అపహకరించుకుపోయారు. బాదితుడు మేదేటి రమేష్ వివరాలు ప్రకారం... శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ల్యాబ్ లో పనిచేసి ఇంటికి వెళ్లనని శనివారం ఉదయం 8.30 గంటలకు వచ్చి చూసే సరికి మెడికల్ స్టోర్ తలలు తెరిచి ఉన్నాయని చెప్పారు. ల్యాబ్ లోకి వెళ్లి చూడగా వివిధ వైద్య పరిక్షలకు ఉపయోగపడే మొత్తం 45 వేల విలువగల పరికరాలను ఎత్తుకపోయరని తెలిపారు దీంతో పోలీసులకు సమాచారం అందించడం తో సిఐ సదయ్య, ఎసై సతీష్ లు సంగటన స్తలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

 
Top