వైద్య విద్య అభ్యసించానని నమ్మించి వైద్యురాలిగా చలామణి అవుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ పట్టణం లోని అస్నాద రోడ్డు ప్రాంతం లో కొన్ని నెలలు గా స్త్రీ వైద్య నిపుణరాలు గా చెలామణి అవుతోంది .
నకిలీ ధృవీకరణ పత్రాలతో విధులు నిర్వహిస్తున్న విజయవాడ ప్రాంతానికి చెందినా భూక్య నాగమణి గుంటూరు చెందినా మరో చెన్ను నాగమణి అనే వైద్యురాలి పేరు, ఆమె రిజిస్టర్ నెంబర్ల తో దృవికరణ పత్రాలు సృష్టియించి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చెన్నూర్ లో ఆసుపత్రి లో వైద్యురాలిగా చేరింది .
ఆమె ప్రవర్తన ,వైద్య విదానం తీరు, రోగులకు రాసే మందుల చిట్టిలను చూసి అనుమానం వచ్చిన ఆసుపత్రి నిర్వాహకులు ఆమె నకిలీ డాక్టర్ గా నిర్ధారించుకొని పోలీసులకు పిర్యాదు చేయడం తో విచారణ చేసి నకిలీ వైద్యురాలి బాగోతం బట్టబయలు చేశారు.

Post a Comment