బ్లాక్ మనీపై యుద్ధం ప్రకటించామని.. అవినీతి అంతమే తమ లక్ష్యమని ప్రకటించారు పీఎం మోడీ. నకిలీ నోట్లను సమర్థవంతంగా అడ్డుకునేందుకు రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.  అయితే పాత నోట్లను ఎలా మార్చుకోవాలి అనే దానిపై అందరిలోనూ గందరగోళం, ఆందోళన నెలకొంది. వీటికి కొన్ని సూచనలు చేశారు ప్రధాని.

ఇలా మార్చుకోవచ్చు..

… ఈ నెల 10 నుంచి కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు
… నోట్ల మార్పిడికి ఎలాంటి రుసుము అవసరం లేదు
… పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో మార్పిడి
… రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక కౌంటర్లలో మార్చుకోవచ్చు
…. బ్యాంకుల నుంచి రోజుకు 10 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా
… వారానికి రూ. 20 వేలకు పరిమితి
… రైల్వే, బస్, విమాన టికెట్ల కొనుగోలుకు, పెట్రోల్ బంకులు, హోటల్స్ లో పాత నోట్ల చలామణికి ఎలాంటి ఇబ్బందులు లేవు
… ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కోఆపరేటివ్ సంస్థలు, మిల్క్ బూత్ లు, శ్మశానాల్లో పాత నోట్లు చలామణి
…  ఆన్ లైన్ లావాదేవీలు యథేచ్చగా చేసుకోవచ్చు

Post a Comment

 
Top