న్యూఢిల్లీ: నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి అంటే నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, వెయ్యిరూపాయల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న 500, వెయ్యి నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల గడువిచ్చారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో పాత 500, వెయ్యినోట్లు మార్చుకునే వీలిచ్చారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

 
Top