సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు యాజమాన్యం ఓకే చెప్పింది. హైదరాబాద్ లో జరిగిన బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల సమావేశం అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు చైర్మన్ అండ్ ఎండీ శ్రీధర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బోర్డు సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 15ఏళ్ల తర్వాత ఈ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించింది బోర్డ్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు తిరిగి ప్రారంభం కావటంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2002 నుంచి వారసత్వ ఉద్యోగాలు బంద్ అయ్యాయి.

వారసత్వ ఉద్యోగాలకు మార్గదర్శకాలు :

… అక్టోబర్ 11, 2016 నాటికి 48 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండాలి. వీళ్లే వారసత్వ ఉద్యోగాలు కోరేందుకు అర్హులు.

… కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందవచ్చు.
… వారసత్వ ఉద్యోగం పొందే అభ్యర్థి వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపీ కవిత, మాజీ ఎంపీ వివేక్ కృషి

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఎంపీ కవితతో పాటు మాజీ ఎంపీ వివేక్ కృషి చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎంకేసీఆర్ ను కలుస్తూ.. ఫాలో అప్ చేశారు. ఎప్పటికప్పుడు సింగేరేణి అధికారులతో మాట్లాడారు. తాజాగా వచ్చిన నిర్ణయంతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు మాజీ ఎంపీ వివేక్.

Post a Comment

 
Top