ఇటవల స్ధానిక కార్మెల్ పాటశాల ఆవరణంలో జరిగిన రాష్ట్ర స్ధాయి క్రిస్టియన్ కరేటే. 2015 పోటిలలో స్ధానిక సింగరేణి మహిళా ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల విద్యర్దినిలు తమ ప్రతిభ కనబర్చారు. పలు బహుమతులు సాదించి సత్తా చాటారు. జూనియర్స్ కటాస్ విభాగంలో డీ,సంద్యారాణి, ప్రవాలిక, జై. మేఘన గోల్డ్, కృష్ణవేణి సిల్వర్, గ్రూప్స్ కటాస్ జూనియర్స్ విభాగంలో పి. సహర్ష , ఎ. లత, డీ. ఆకాంక్ష గోల్డ్, సినియర్స్ గ్రూప్ కటాస్ విభాగంలో ఐ. రాశి సిద్దార్థ, కే. సంద్యారాణి, సి హెచ్. సౌజన్య,  గోల్డ్ కే. కృష్ణవేణి, ఐ, ప్రసన్న, ఐ అనిత సిల్వర్ మెడల్స్ ను కైవసం చేసుకున్నారు. వీరిని చైర్మన్ ములకల శంకర్, ఉపాధ్యక్షుడు కొందిల్లా సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర వెంకటేష్, కళాశాల కరస్పందేంట్లు కుందన్మాల్ ఉపాద్యాయ, ముకేష్ ఉపాద్యాయులు అభినందించారు.

Post a Comment

 
Top