మంచిర్యాల పట్టణంలోని ఫారెస్ట్ కమ్యూనిటీ హాల్ లో అటవీ క్షేత్ర సిబ్బంది కి ద్విచక్ర వాహనాల పంపిణి కార్యక్రమం లో అటవీ శాఖా మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.అయన అటవీ శాఖా సిబ్బందికి కి ద్విచక్ర వాహనాలను పంపిణి చేసి జెండా ఉపి ప్రారంభించారు. ఆదిలాబాద్ తూర్పుజిల్లా ప్రాంతలైన కాగజ్ నగర్ ,బెల్లంపల్లి, మంచిర్యాల ,
జన్నారం డివిజన్ పరిధి లో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖా ఉద్యోగులకు 4 వందల 77 ద్విచక్ర వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయినవని మంత్రి జోగు రామన్న అన్నారు.అటవీశాఖ సిబ్బందికి ఆయుదాలు విషయంలో డిఎఫ్ ఓ స్థాయి అధికారులకు రక్షణ గా పోలీస్ దళాలను ఏర్పాటు చేస్తామని, కలప స్మగ్లర్ల పై రాష్ట్ర ప్రభుత్వం పిడి ఆక్ట్ ను వేస్తామని అటవీశాఖమంత్రి అన్నారు.