హైదరాబాద్ లో కలకలం. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు SI శ్రీధర్. ఉప్పరపల్లి PV ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 174 సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన జరిగింది. ప్రధాని మోడీ బందోబస్తు విధుల్లో ఉన్నాడు శ్రీధర్. 2012 బ్యాచ్ లో ఎస్సై గా సెలక్ట్ అయ్యాడు. కొమురం భీం జిల్లా పెంచికల్ పేటలో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు పోలీసులు. శ్రీధర్ వరంగల్ జిల్లా వాసి. కాగజ్ నగర్ రూరల్ ఎస్సైగా పని చేశారు. స్పెషల్ బ్రాంచ్ లో కొన్ని రోజులు విధులు నిర్వహించాడు. ఇంకా పెళ్లి కాలేదు.

గుండెల్లో కాల్చుకున్న శ్రీధర్

SI శ్రీధర్ ఆత్మహత్యతో పోలీస్ శాఖ షాక్ అయ్యింది. తన సర్వీస్ రివాల్వర్ తో గుండెల్లో కాల్చుకున్నాడు. ఒంటిపై యూనిఫాం ఉంది. ఎడమ చేతి వైపు గన్ పడి ఉంది. తీవ్ర మనోవేదనతోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Post a Comment

 
Top