మందమర్రి  ఆదర్శ  (మోడల్) స్కూల్ లో రెవల్యూషన్ యూత్ స్వచ్ఛంద సంస్ధ అధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఇట్యాల కిషన్ హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేకు కట్ చేసి రెవల్యూషన్ యూత్ సబ్యులకు తినిపించారు.అనంతరం విద్యార్ధులకు నోట్ పుస్తకాలు,పండ్లు , కేకు ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్ధ అధ్యక్షుడు చాట్లపల్లి అనిల్,ఎం డి  అక్బర్,రాజీవ్,దీపక్,కృష్ణ,అరుణ్,మోసిన్,సాగర్ ,షారుక్ ,నవీన్,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

 
Top