మందమర్రి మునిస్పలిటి  ఎన్నికలు జరిపించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతూ గురువారం అఖిల పక్షం అద్వర్యం లో ప్రభుత్వ విప్ నల్లాల ఒదేలుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులూ మాట్లాడుతూ మున్సిపలిటిలో పాలక వర్గం లేక అనుకున్న మేరకు అభివృద్ధి జరగడం లేదని వారు పేర్కొన్నారు. మునిస్పాల్ ఎన్నికలపై స్టే ఉన్న అందున దానిని తొలగించేలా కృషి చేయాలనీ విప్ ను కోరారు. విప్ స్పందించి సిఎం కెసిఆర్ దృష్టికి మున్సిపాలిటి ఎన్నికల విషయాన్నీ తిసుకపోతనని అయన స్పష్టం చేసారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులూ గుడ్ల రమేష్,పైడీమల్ల నర్సింగ్,మేకల రమేష్,తున్గిపింది రమేష్,ఒడ్నల శంకేర్ ,దుర్గరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

 
Top