తమిళనాడు సీఎం జయలలిత ( 68 ) కన్నుమూశారు. 74 రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది అమ్మ. పురచ్చితలైవిగా తమిళనాట జేజేలు పలికించుకున్న జయ.. తీవ్ర గుండెపోటుతో తుది ప్రాణాలు విడిచింది. అమ్మ ఇక లేదు అని తెలిసి తమిళనాడు శోకసంద్రం అయ్యింది. డీహైడ్రేషన్, జ్వరంతో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. డయాబెటిక్ పేషంట్ అయిన జయ.. కిడ్నీ సంబంధ వ్యాధితోనూ బాధపడ్డారు. శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లండన్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చింది. కోలుకున్నారు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ డిశ్చార్జ్ కావొచ్చు అని స్వయంగా అపోలో చైర్మన్ ఇటీవలే ప్రకటించారు. అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలోనే.. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ఆరు గంటల టైంలో జయలలితకు తీవ్ర గుండెపోటు వచ్చింది. గంటపాటు చికిత్స అందించిన వైద్యులు.. ఎక్మో అమర్చారు. 24 గంటలు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అమ్మ కన్నుమూశారు. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే పురచ్చ తలైవి.. శాశ్వతంగా విడిచివెళ్లింది.

Post a Comment

 
Top